అడ్రియాలలో మరో గని ప్రమాదం
పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ప్రమాదం మరిచిపోకముందే శనివారం మరో ప్రమాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడు రియాజుద్దీన్పై బొగ్గు పెళ్ల పడింది. ఈ ప్రమాదంలో రియాజుద్దీన్ మెడపై గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్రియాల లాంగ్వాల్ భూగర్భ గనిలో ఈ నెల 7న పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. అందులో ముగ్గురు బయటపడగా, ముగ్గురు మృతి చెందారు.