ముఖ్యమంత్రి కోసం మృత్యుంజయ హోమం
ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్న ఈ హోమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే ముఖ్యమంత్రి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.