పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

మంచిర్యాల : పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తార‌ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెడి లైఫ్ మంచిర్యాల ఆస్పత్రి యాజమాన్యం పోలీసు సిబ్బందికి ఉచితంగా హెల్త్ కార్డులను అందజేసింది. మెడిలైఫ్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం పోలీసు కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై పోలీసు సిబ్బంది, అధికారులకు ఉచితంగా ఆరోగ్య కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కరీంనగర్, హైదరాబాద్ ఆసుప‌త్రుల‌కు వెళ్ల‌లేమ‌న్నారు. అందువల్ల స్థానికంగా ఉన్న ఆసుప‌త్రుల్లో చెక్ చేసుకోవాల్సి వస్తుందన్నారు. పోలీస్ సిబ్బంది చికిత్స సమయంలో ఫీజు రాయితీ ఇచ్చిన మెడిలైఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నూతన్ అరవింద్ కి, హాస్పిటల్ యాజమాన్యానికి క‌మిష‌న‌ర్ కృతజ్ఞతలు చెప్పారు. పోలీస్ సిబ్బంది కూడా చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాల‌న్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ రష్మీపెరుమాళ్, బెల్లంపల్లి ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్,మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ,మహిళ పీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీనివాస్,ఆర్ఐ అనిల్, డాక్టర్లు కుమార్ స్వామి, చైతన్ చౌహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like