ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

తమను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కృతజ్ఞలతో ఎన్ఆర్ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోటపల్లి మండలం వెల్మపల్లి గ్రామంలో వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండలం వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ప్రజల కోసం ఆలోచించే మనిషి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్శిలు తపిస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమం లో వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, పీఏసీఎస్ చైర్మన్ సాంబ గౌడ్, వైస్ చైర్మన్ వా ల వెంకటేశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.