రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మంచిర్యాల : శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్.టి.సి.బస్సు, బైక్ ఢీ కొట్టాడంతో వారు మరణించారు. ఇందారం, రామరావుపేట కు చెందిన ప్రసాద్, నరేష్ అనే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పండగ రోజే ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.