తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి..

సిపిఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం హైదరాబాద్లోని కేర్ వైద్యశాలలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరి అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.