చికిత్స పొందుతూ యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. చెన్న వెంకటేష్ లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా చనిపోయాడని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించాడని కుటుంబ సభ్యుల ఆరోపించారు. వైద్యుల పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను శాంతించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరణించిన వెంకటేష్ రామకృష్ణాపూర్ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తిగా సాగుతున్నాడు.