కోటి రూపాయలు కాజేశారు
-ఉపాధి హామీ ప్రజా వేదిక రసాభాస
-సరిగ్గా స్పందించని పీడీ
-ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్‌లు

ఆదిలాబాద్:ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రజావేదిక రసాభాసగా మారింది. అవినీతి అక్రమాలపై తాము చెబుతున్నా ఉన్నతాధికారులు సరిగ్గా స్పందించకపోవడం పట్ల పలువురు నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక నిర్వహించారు. 12 వ విడత సామాజిక తనిఖీలో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ పనుల్లో భారీగా అక్రమాలు చేశారని, పని చేయకుండానే బిల్లులు తీసుకున్నారని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆరోపించారు. బిల్లులు స్వాహా చేసిన అధికారులు ఈ విషయాన్ని కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాందాస్ అనే ప్రభుత్వ ఉద్యోగి కేవలం పార్ది కే గ్రామపంచాయతి లో సుమారు కోటి రూపాయల కుంభకోణం చేశాడని విమర్శలు గుప్పించారు. రాందాస్ అనే వ్యక్తి ఎవరు చెప్పాలని, అతన్ని తమకు అప్పగించాలని కోరారు. ఈ విషయంలో జిల్లా పీడీ సరైన సమాధానం చెప్పలేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.