మరణించిన మిత్రుడి కుటుంబానికి అండగా..
తోటి మిత్రుడు మరణించిన విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. మేం ఉన్నామని ముందుకు వచ్చారు. 1994-95లో గోదావరిఖని వాణి విద్యా విహార్ హై స్కూల్ పదవ తరగతి చదువుకున్న సుదగొని సతీష్ అనారోగ్యంతో మరణించారు. గత నెలలో ఆయన చనిపోవడంతో ఆయన కుటుంబానికి అండగా ఉండాలని పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు చదువుకున్న సుమారు 50 మంది విద్యార్థినీ, విద్యార్థులు డబ్బులు జమ చేశారు. రూ. 61, 500 సతీష్ కూతురు సహస్ర పేరుపై పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఆదివారం సతీష్ కుటుంబానికి మిత్ర బృందం ఈ పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో ఈర్లరాజేష్,కాంపెల్లిశ్రీనివాస్,గోవర్ధన్,రాములు,పి.మొగిలి,నూనె సత్యనారాయణ,రాకేష్,రవి,వేమలత,రాణి,శోభారాణి,ప్రసన్న,సరిత,రజిత,ఉష, బి.వాణి, పి.వాణి, రొట్టంమల్లేష్,ప్రణయ్ సాగర్,హరిప్రసాద్,బుర్రసతీష్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.