హస్తినకు తెలంగాణ మంత్రుల బృందం..

ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వాడ అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలని, లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బండి సంజయ్కు ఏం సంబంధమన్నారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అంటే స్పష్టమైన హామీతో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా ? అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కొంటున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలన్నారు. ఈ వడ్లనే కొంటాం ఆ వడ్లనే కొంటాం అంటే ఎలా అని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఈయన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాడు, ఏం చేశాడో చెప్పాలన్నారు. ఇతని వలన రాష్ట్రానికి ఏం ఒరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.