ఆ సమ్మె రాజకీయ ప్రయోజనాల కోసమే

సింగరేణి కార్మికులకు చెందిన సిఎంపీఎఫ్ డబ్బుల గోల్ మాల్‌పై సీబీఐ విచారణ చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి వీరమనేని రవీందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశ్ ఖని ఓపెన్ కాస్ట్ 2, మణుగూరు ఏరియాలో నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీకి 1300 కోట్ల రూపాయలు సీఎంపీఎఫ్ ట్రస్ట్ అప్పుగా ఇచ్చిందన్నారు. DHFL కంపెనీ దివాలా తీయడంతో ఆ కంపెనీ బాకీ ఉన్న 727 కోట్ల 56 లక్షల రూపాయలను CMPF ట్రస్టు బోర్డు మాఫీ చేసిందని ఇది ఎంత వరకు సమంజమని ప్రవ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సీఎంపీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అన్ని సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో ధర్నాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరమనేని రవీందర్ రావు పిలుపునిచ్చినారు..
ఏబీకేఎంఎస్ కార్యదర్శి,జేబీసీసీఐ కార్యదర్శి మాధవనాయక్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కోల్ బ్లాకుల ప్రైవేటీకరణ విషయంలో కార్మికులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టిఆర్ఎస్ ఎంపీలు కవిత, బాల్క సుమన్ బిల్లుకు మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ రోజు ప్రైవేటైజేషన్ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాతనే ప్రైవేటైజేషన్ పెరిగిపోతోందని అన్నారు. ఈ రోజు 64 వేల మంది కార్మికుల నుంచి 43 వేల మంది కుదింపు జరిగిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 10 వేల నుండి 30 వేలకు పెరిగిందన్నారు.
బీఎంఎస్ మణుగూరు ఏరియా ఉపాధ్యక్షుడు భూక్యా కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగరేణి పెన్షన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర బాబు, ఎస్సీఎంకేఎఎస్ కేంద్ర సెక్రటరీ టీపీవీ శివ రావు, మంచినీల స్వామి, మల్లికార్జున్, ప్రదీప్ అల్లి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.