ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 14 శాతం విద్యుత్ చార్జీలు పెంచుతూ టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ పై 40-50 పైసలు పెంచనున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. ప్రతిపాదిత చార్జీల పెంపును కూడా ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ విషయమై రాష్ట్రంలోని పలు చోట్ల ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించింది. పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు బహిరంగ విచారణలో పాల్గొని ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్‌సీకి టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు రూ.4,037 కోట్లను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు అంతర్గత సామర్ధ్యంతో పూడ్చుకొంటామని డిస్కం సంస్థలు ఈఆర్సీకి తెలిపాయి. 2021-22 ఏడాదికికి ఎలక్టిసిటీ పెంపునకు ప్రతిపాదనలు పంపాలని ఈఆర్సీ డిస్కంలకు వారం రోజుల గడువును ఇస్తూ 2021 డిసెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 28న చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాయి.
తెలంగాణలో 2022-23 లో రెండు డిస్కం కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి. 2022-23 లో రూ.53,053 కోట్ల రెవిన్యూ అవసరం. రూ. 36, 474 కోట్ల రెవిన్యూ వస్తోందని డిస్కం కంపెనీలు అంచనా వేశాయి. రూ.5652 కోట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో వస్తాయని డిస్కం కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సుమారు రూ.10,928 కోట్ల రెవిన్యూ లోటు ఉంటుందని అంచనా వేశాయి
ఈ రూ.10,928 కోట్ల రెవిన్యూ లోటును పూడ్చుకొనేందుకు విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కం కంపెనీలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీసీకి ప్రతిపాదనలు అందించాయి. రూ.6831 కోట్లను చార్జీల పెంపు ద్వారా ఆర్జించాలని ప్రతిపాదనలను పంపాయి.గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూ. 1 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.