బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా
పబ్ కల్చర్ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అదంతా వేరే లోకం.. నియాన్ లైట్ల వెలుతురో మత్తులో తూగుతూ.. జోగుతూ యువత చిత్తవుతుంటారు. ప్లాష్ లైట్ల మధ్య ఫుల్ ఎంజాయ్ మెంట్. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడులు చేయడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అందులో డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు తెలియడంతో సంచలనంగా మారింది. ఇందులో కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు సైతం బయటకు వచ్చారు. వారిలో షార్ట్ ఫిల్మ్ క్యూట్ యాక్టరస్ కుషిత సైతం ఉన్నారు. అయితే ఆమె చెబుతున్న కారణాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
పబ్‌కు వెళ్లింది.. డింక్స్ కోసమో… గంజాయి కోసమో కాదంట.. కేవలం బజ్జీల కోసమే వెళ్లానని చెబుతోంది ఆ అమ్మడు. అది కూడా మామూలు బజ్జీలు కావట… ఎక్ట్రా ఛీజ్ తో చేసిన బజ్జీలట. వాటికోసమే… వాటిని తనివితీరా తినాలన్న ఆశతోనే రాడిసన్ పబ్‌కు వెళ్లిందని స్పష్టం చేస్తోంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చింది ఈ అందాలబొమ్మ.
ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను. మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది.. ఇంటికి వెళ్దామనుకున్నాం. అంతలోనే పోలీసులు వచ్చారు. అనవసరంగా మాపై తప్పడు ప్రచారం చేయకండి. మేం డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి సైతం కుటుంబాలు ఉన్నాయని, ఇది గుర్తుంచుకోవాలన్నారు. తమ కుటుంబసభ్యులు తాము డ్రగ్స్ తీసుకున్నామన్న వార్తలు నిజమని భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదని స్పష్టం చేశారు. తెలిస్తే మేము ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని వేడుకున్నారు.
అయితే, అంతకు ముందు విడుదల చేసిన ఒక వీడియోలో కేవలం స్నేహితులతో మాత్రమే ఎంజాయ్ కోసం పబ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది. తన ఫ్రెండ్‌కు పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా అక్కడకు వెళ్లినట్లు స్పష్టం చేసింది. మీకు 21 ఏండ్లు నిండకుండానే డ్రింక్స్ సప్లయ్ చేశారా? అన్న ప్రశ్నకు అసలు తాను డ్రింక్స్ కూడా తీసుకులేదని వెల్లడించింది. పబ్‌లో కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.