సర్ప్రైజ్ అంది.. కాబోయే భర్త గొంతు కోసింది..
కాబోయే భర్తను సర్ప్రైజ్ కళ్లు మూసుకో అంది.. ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న కత్తితో అతని గొంతు కోసేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి జిల్లాలోని పాడేరుకు చెందిన రాము నాయుడుకి రావికమతం మండలానికి చెందిన పుష్పతో వివాహం నిశ్చయం అయ్యింది. వచ్చేనెల 29న నిశ్చితార్థం నిర్ణయించారు. యువకుడు హైద్రాబాద్ సీఎస్ఐఆర్ పరిశోధకుడిగా చేస్తున్నాడు. అయితే.. ఈమెకు వివాహం ఇష్టం లేదు. ఇటీవల హైదరాబాద్ నుండి యువకుడు విశాకు వచ్చాడు. నీతో మాట్లాడాలని యువకుడికి యువతి చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి కొమ్మలపూడి సాయిబాబా కొండపైకి వెళ్లారు. ఒక సర్ ఫ్రైజ్ ఉందని.. కళ్లు మూసుకుంటే.. ఇస్తానని యువతి చెప్పింది.
దీంతో ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న చాకుతో యువకుడి గొంతు ఒక్కసారిగా కొసేసింది. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని అతడిని అనాకపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు ఆ యువతి తెలిపింది. విషయం తెలుకున్న యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపడుతున్నారు.