సాయిగణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్

పోలీసులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ… ఖమ్మంలో ఆత్మహత్యకు బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. . కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని బీజేపీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో మరణించిన సాయిగణేష్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. అమిత్ షా ఉదయం సాయిగణేష్ అమ్మమ్మ సావిత్రి, చెల్లి కావేరితో ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. సాయి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరపించాలని కోరారు కుటుంబ సభ్యులు.