మాదారం లో విరిగిన విద్యుత్ స్తంభాలు
తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో సింగరేణి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు నాలుగు పోల్స్ విరిగాయి. అవి కాస్త ప్రభుత్వ విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో మాదారం కాలనిలో సరఫరా నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ DyGM శివరాం రెడ్డి, సూపర్వైజర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.