రైతుల‌కు గుడ్‌న్యూస్

హైద‌రా‌బాద్: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందు‌గానే కేర‌ళను తాకే అవ‌కాశం ఉన్నదని వాతా‌వ‌రణ నిపుణులు చెప్తు‌న్నారు. సాధా‌ర‌ణంగా జూన్‌ 1 నాటికి రుతు‌ప‌వ‌నాలు కేర‌ళను తాకు‌తాయి. ఈసారి నైరుతి రుతుప వనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండ‌మాన్‌ సముద్రం, దానికి ఆను‌కొని ఉన్న ఆగ్నేయ బంగా‌ళా‌ఖాతంలోకి ప్రవే‌శించే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. దీంతో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తొలి వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రుతుపవనాలు ఈసారి కేరళకు ముందుగానే వచ్చే అవకాశం ఉదని చెప్పారు. జూన్‌ 5 నుంచి 8 మధ్య తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలిపారు. కాగా, ఈ ఏడాది దేశ‌వ్యా‌ప్తంగా సమృ‌ద్ధిగా వర్షాలు కురు స్తాయని అంచనా వేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like