అభివృద్ధికి చిరునామా టీఆర్ఎస్‌

-ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌నిచేస్తాం
-ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

మంచిర్యాల : ఉద్య‌మ బాట ప‌ట్టి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్న‌ట్లే, అదే స్ఫూర్తితో ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకు ప‌ని చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ అన్నారు. ఆయ‌న శ‌నివారం కోటపల్లి మండలంలో తుంతుంగ వాగుపై రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గించేందుకు ఇక్క‌డ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు నిధులు తీసుకువ‌చ్చామ‌న్నారు. వ‌ర్షాకాలం వ‌చ్చే స‌రికి ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే కోటపల్లి మండలంలోని ఏదులబంధం,సిర్సా,పుల్లగామ,రొయ్యలపల్లి,ఆల్గామా,జనగామ,వెంచపల్లి గ్రామాల దశాబ్దాల కష్టాలు తొలగిపోతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

విప్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌..
ప్ర‌భుత్వ విప్ సుమ‌న్ శ‌నివారం సుడిగాలి ప‌ర్య‌ట‌న నిర్వ‌హించారు. ఆయ‌న ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన క్యాతనపల్లి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయినపల్లి నర్సింగరావు చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
– జైపూర్ మండలంలో రూ. 2.50 కోట్లతో రామారావు పేట్ చెరువు కట్ట నుంచి రామారావు పేట్ గ్రామానికి వెళ్లే చెరువు కట్ట అభివృద్ధి, రోడ్డు పనులను ప‌రిశీలించారు.
– మందమర్రి సాయి మిత్ర గార్డెన్స్ లో సంజయ్ చారి & మాధురి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
– మందమర్రి మార్కెట్ ఏరియాలో సదా సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు.
– రామకృష్ణాపూర్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం 16వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.
– నూతనంగా ఏర్పాటుచేసిన ఆన్విక మెడికల్ షాప్ ను ప్రారంభించారు.
– కోటపల్లి మండలం వెంచపల్లి సర్పంచ్ పడాల రాజుభాయి మనమడు యువ నాయకులు పడాల సతీష్& రవళి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
-ఇటీవల యాక్సిడెంట్ లో మృతి చెందిన తుంగ రాయపోషం కుటుంబ సభ్యులను, ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
-ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెరాస కార్యకర్త సికినం కిష్టయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న వెంట ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, వాలా శ్రీ‌నివాస్ రావు త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like