సరిహద్దుల్లో వరణుడి బీభత్సం
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు జిల్లాలో సైతం గాలి వాన బీభత్సం సృష్టించింది. గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలుకలో బలమైన ఈదురుగాలులు, గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో సిరోంచ రామంజపూర్ పెట్రోల్ బంక్ పై భాగంలో రేకులు ఎగిరిపోయాయి. అక్కడ బైకులు సైతం గాలికి కింద పడ్డాయి. పలు చోట్ల రహదారికి చెట్లు అడ్డంగా విరిగి పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో సైతం పలు చోట్ల వడగళ్ళ వర్షం పడింది. నెన్నల్ మండల కేంద్రంలో చెరకు తోటలో పిడుగుపడి మంటలు చెలరేగాయి. వేమనపల్లి మండల కేంద్రంలో వడగండ్ల వర్షంతో పలు చోట్ల ఇంటి పై కప్పులు ఎగిరి పోయాయి.