జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య

మంచిర్యాల:జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తోన్న మాస ఉమాదేవి తిరిగి బెల్లంపల్లి CDPOగా వెళ్లిపోయారు. ఆమెకు జిల్లా సంక్షేమశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సఖి కేంద్రంలో వాహన కేటాయింపు విషయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె భర్త డ్రైవర్ దగ్గర డబ్బులు అడిగిన ఆడియో టేపులు సైతం వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ భారతి హాలికెరీ ఆమెకు మెమో జారీ చేసారు. అనంతరం ఆమె వెనక్కి తిరిగి CDPOగా వెళ్లారు. ఆ స్థానంలో చిన్నయ్య బాధ్యతలు స్వీకరించారు.