ఫ్లాష్.. ఫ్లాష్… ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు..
ఆసిఫాబాద్ జిల్లా: ఈత కోసం వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన కాగజ్నగర్ మండలం నామనగర్లో జరిగింది. సమీపంలోని పెద్దవాగులో ఈత కోసం నలుగురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఇద్దరు విద్యార్థులు వాగులోకి దిగారు. వీరు నీటిలో మునిగిపోతుండగా, దగ్గర్లోనే ఉన్న జాలర్లు ఒకరిని కాపాడారు. ఈ ఘటనలో బైరగోని శ్రావణ్ (17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి గల్లంతయ్యాడు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. జాలర్ల సాయంతో గల్లంతయిన విద్యార్థి కోసం గాలిస్తున్నారు.