షీ టీమ్స్‌లో మనకి రెండో స్థానం
మంచిర్యాల :మహిళలు, విద్యార్థినులకు సేవలు అందిస్తున్న రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్‌కి ద్వితీయ స్థానం లభించింది. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదు షీ టీమ్స్ పని చేస్తున్నాయి. మహిళలు,యువతులు,విద్యార్థినిలకు అందుబాటులో ఉంటూ నిత్యం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోకిరీలతో, పనిచేస్తున్న స్థలాల్లో, ప్రధాన కూడళ్లలు, బస్టాండ్లు, స్కూళ్లు, కళాశాలలలో ఇబ్బంది ఉంటే వెంటనే స్పందిస్తున్నారు. వారికి మేమున్నామని భరోసా, ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు బటయకు రాకుండా సమస్య పరిష్కారం అవుతుండంతో బాధితులు సైతం ఫిర్యాదు చేసేందుకు వెనకాడటం లేదు. ఇలా సమస్యల పరిష్కారంలో ముందున్న రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటిమ్స్ కి తెలంగాణ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం లభించింది. ఈ షీ టీం అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.