పార్టీలు మారే అవ‌కాశం వ‌చ్చినా మార‌లేదు

-కార్య‌క‌ర్త‌లు,నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు
-కార్య‌క‌ర్త‌లే నా బ‌లం, బ‌ల‌హీన‌త‌
-ఏఐసీసీ స‌భ్యుడు కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు

మంచిర్యాల :తనకు ఎన్నోసార్లు పార్టీలు మారేందుకు అవకాశం వచ్చినా తాను మారలేదని కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్యం, సమానత్వం ఉందని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా సంస్థాగత బూత్ లెవెల్ ఎన్‌రోల్‌మెంట్ కార్య‌క్ర‌మం ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గంలో లక్షా 40 వేల పై చిలుకు సభ్యత నమోదు చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన కార్యకర్తలు, ముఖ్య నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరన్నారు. అస‌లు పార్టీలకు మనుగడే లేదన్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తానని కార్యకర్తలే నా బలం బలహీనత అని స్పష్టం చేశారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే పార్టీలు, నాయకులు మూల్యం చెల్లించక తప్పదన్నారు.

అందుకే ఈ సమావేశంలో వేదికపైన కాకుండా కార్యకర్తల మధ్యలోనే నాయకులు కూర్చుని కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతులు,యువకులు, నిరుద్యోగుల సమస్యలను ప‌రిష్క‌రించ‌డంలో విఫలం అయ్యాయని విమర్శించారు.

అంత‌కుముందు పీసీసీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పెద్దపల్లి పార్లమెంట్ ని ముందు వరుసలో నిలిపినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. సోనియా, రాహుల్ కు ఈ.డీ. సమన్లు పంపి విచారించేందుకు కేంద్రం ప్రయత్నించడం తగదన్నారు. 13న దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీలకు సమన్లను జారీ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ,మాజీ మంత్రి వినోద్ ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రసంగించారు. కార్య‌క‌ర్మంలో జిల్లా పరిశీలకుడు మహేష్ గౌడ్, డిఆర్వో మహేష్, బిఆర్వోలు సత్తయ్య,సదానందం, రాజేష్ హాజ‌ర‌య్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like