ప్రభుత్వ వైఖరితో ప్రమాదంలో సింగరేణి
-INTUC గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
-సంస్థని కాపాడుకోవడానికి గెలుపు అనివార్యం
-INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్, మాజీ MLA నల్లాల ఓదెలు
మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వ వైఖరితో సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రమాదంలో పడిందని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. మందమర్రి INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మాట్లాడారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తుంటే,మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఆర్థికంగా దివాళా తీసేలా చేస్తున్నదన్నారు. రూ.26 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీ ప్రభుత్వ వైఖరి వల్ల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితికి దిగజారిందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు సింగరేణికి రూ. 18 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే వాటిని ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గుర్తింపు సంఘంగా చెప్పుకుంటున్న TBGKS అసమర్థత వల్ల సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల పైరవీల కోసం కార్మికుల సమస్యలను గాలికొదిలేసారని అన్నారు.
సింగరేణిని బతికించుకోవాలంటే త్వరలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో INTUC గెలుపు అనివార్యమన్నారు. కార్మికలోకం INTUCకి అండగా ఉండాలని కోరారు.మూడుసార్లు MLAగా,ప్రభుత్వ విప్ గా చేసిన నల్లాల ఓదెలు, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభసూచకమన్నారు. వారి చేరికతో చెన్నూరు నియోజకవర్గంలోనే కాకుండా మంచిర్యాల జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతుందన్నారు. త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో ఓదెలు సహకారంతో మందమర్రి ఏరియాలో INTUC తప్పక విజయం సాధిస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఓదెలు మాట్లాడుతూ బాల్క సుమన్ అరాచకాల నుండి చెన్నూరు ప్రజలను కాపాడుకోవడానికే తెలంగాణ ఇచ్చిన కాంగ్రేస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో INTUC గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెలును ఘనంగా సన్మానించారు. INTUC ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో INTUC కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్ రాంశెట్టి, RKP ఏరియా ఉపాధ్యక్షుడు తేజవత్ రాంబాబు,ఏరియా కార్యదర్శులు K.ఓదెలు, దొరిశేట్టి చంద్రశేఖర్, బత్తుల వేణు, కొంరయ్య, శనిగారపు రాములు, యాదగిరి,విక్రమోద్దీన్, బిమారపు సదయ్య, గొర్ల శ్రీనివాస్, రాజేష్, కిశోర్, హనుమాండ్ల రాజేంద్రప్రసాద్, కలమండ స్వామి, వెంకటస్వామి, చిరంజీవి,ప్రభాకర్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.