కింద పడుతుండగా ఎస్ఐ భుజం పట్టుకున్నా : రేణుకా
‘నన్ను వెనకాల నుంచి తోసేశారు.. దాంతో కింద పడుతుండగా.. ఎస్ఐ భుజం పట్టుకున్నా.. పోలీసులను అవమానపరిచే ఉద్దేశం లేదు… పోలీసుల పట్ల గౌరవం ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. రాజ్‌భవన్ వద్ద ఎస్ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్న ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. రేణుకా చౌదరిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నేతల రాజ్ భవన్ ముట్టడిలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఉపేంద్ర ఫిర్యాదు చేశారు. మరోవైపు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్ఐకి సారీ చెప్పడానికి తనకేం ఇబ్బంది లేదన్నారు. కానీ పోలీసులు కూడా తనకు సారీ చెప్పాలన్నారు. పోలీసులకు తన చుట్టూ ఏం పని అని ప్రశ్నించారు.