నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
మంత్రి హరీష్‌రావుకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి
అర్హులైన భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయించాలని మంత్రి హరీష్ రావుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. రామగిరి మండలం లద్నాపూర్‌లో 283 మంది భూ నిర్వాసితులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూనిర్వాసితులతో కలిసి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సంబంధిత రెవెన్యూ సింగరేణి అధికారులతో వెంటనే మాట్లాడాలి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అన్ని అర్హతలు ఉన్న భూ నిర్వాసితులకు వెంటనే ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్పత్రుల సమస్యలు పరిష్కరించండి..
ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గంలోని ఆసుపత్రులపై సైతం వినతిపత్రాలు అందించారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. మంథని ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనానికి నిధులు కేటాయించాలన్నారు. మాతాశిశు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ పిడియాట్రిక్ వైద్యులను వెంటనే నియమించాలని కోరారు. మంథనిలో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో శిధిలావస్థలో ఉండి టాయిలెట్స్,డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుత రిపేర్స్ నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కు నిధులు కేటాయించాలన్నారు. డయాలసిస్ పేషంట్లు అత్యవసరంగా సమయంలో దూరప్రాంతాల కరీంనగర్ గోదావరిఖని వెళ్ళవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంథని కేంద్రంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, మాతాశిశు ఆస్పత్రిలో వెంటనే ప్రసుతి సేవల కోసం వెంటనే ప్రారంభించాలని గైనకాలజిస్ట్,పీడియాట్రిక్ వైద్యుల వెంటనే నియమించాలన్నారు.