ఎంఐఎం ఎమ్మెల్యేలు జంప్

మజ్లిస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ చేశారు. బీహార్లో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీని మారారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఏకంగా ఐదు సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది. అలా గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీలో చేరారు. మజ్లిస్ బీహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ను కలిసిన తర్వాత వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్నారు.