హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్
బెల్లంపల్లి ఆర్ముడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏం.జయకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నత అధికారులు, ప్రభుత్వాన్ని కించపరుస్తూ, అవహేళన చేస్తూ సోషల్ మీడియా గ్రూప్ లలో పోస్ట్ లు పెడుతున్నాడని తెలిపారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహారించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రామగుండం కమిషనేరట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట కి భంగం కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. వారిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.