బీజేపీ సమావేశాల్లో కలకలం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇంటెలిజెన్స్ అధికారి తీసిన వీడియోలు, ఫోటోలు కలకలం సృష్టించాయి. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాసరావు సమావేశాలని రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశారు. బీజేపీ తీర్మాణాలకు సంబంధించి పత్రాలు సైతం ఫోటోలు తీశారు. వాస్తవానికి అవి బయటకు తెలియనివ్వరు. సమావేశాలు అయ్యాక చర్చించిన వివరాలు, తీర్మానాల వివరాలు మాత్రమే వెల్లడిస్తారు. అంతకు ముందే ఇంటెలిజెన్స్ అధికారి ఫోటోలు తీస్తుండటం తో బీజేపీ నేతలు పట్టుకున్నారు. అతన్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. కమిషనర్ కి అప్పగించి వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయించారు. మా తీర్మానాల కాపీ లను ఫోటోలను తీశారని అంత అవసరం వచ్చిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కుసంస్కరానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు.