అంబేద్కర్ విగ్రహం ఎదుట గర్భిణీ ఆందోళన
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేటలో ఓ గర్భిణీ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆందోళన నిర్వహించారు. విగ్రహం ముందు కూర్చుని తన నిరసన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట ఉత్కూర్ చౌరస్తాలో మెట్టుపల్లి స్వప్న అనే గర్భిణీ ఆందోళన చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త శ్రీధర్ తనను వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కన్నటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.