అధికార పార్టీ రాజ‌కీయ వికృత క్రీడ

-ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సింది పోయి దూరంగా ఉంటారా..? -జడ్పీ చైర్ పర్సన్ దళిత మహిళ కావడం వ‌ల్ల‌నే ఇలా చేస్తున్నారు -ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి

మంచిర్యాల : ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపైన మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరం ఉండడం ఏమిట‌ని ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆయ‌న మంచిర్యాల జ‌డ్పీ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్యేలు, చాలా మంది ప్ర‌జా ప్ర‌తినిధులు, కొంద‌రు అధికారులు సైతం హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జడ్పీ చైర్ పర్సన్ దళిత మహిళ కావడంతో ఈ విధంగా చేస్తున్నార‌ని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడానికి హాజరు కాకపోవడానికి కారణం రాజకీయ వికృత క్రీడ అని జీవన్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలు ఎన్నో ఉన్నాయ‌న్నారు. పోడు భూముల సమస్య, విత్తనాలు రాయితీపై స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. రైతు రుణమాఫీ సైతం అమలు చేయలేదన్నారు. బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బ్యాంకులు రైతులపై అధిక వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నార‌ని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు చేసి ఎన్నోరోజులు గ‌డుస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన‌ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు ఇవ్వాల్సిన రుణాలు సైతం ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పది సంవత్సరాలు పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాల కింద‌ట‌ వారిపైన కేసు నమోదు చేశారని మళ్ళీ ఇప్పుడు కేసులు నమోస్తు చేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీలకు రైతుబంధు అమలు చేయాలన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ అయ్యేవరకు విద్యా వాలంటరీలను కొనసాగించాల‌ని కోరారు. స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి,ల‌క్ష్సెట్టిపేట జ‌డ్పీటీసీ ముత్తె స‌త్త‌య్య‌ త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like