ఉట్నూరు వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి
ఉట్నూర్ మండలం షాంపూర్ పంచాయతీ పరిధిలోని గోదారిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో అదిలాబాద్ తరలించారు. బాధితులను జిల్లా అదనపు పాలనాధికారి రిజ్వాన్ భాషా ,ఉట్నూర్ తహసిల్దార్ భోజన్న పరామర్శించారు.