సింగరేణి రెస్క్యూ టీం గల్లంతు
ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్ద వాగులో సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు గల్లంతయ్యారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ముంచెత్తడంతో పెసరకుంట పాఠశాలలో గ్రామస్థులు తలదాచుకున్నారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు ఎమ్మెల్యే కోనప్ప చర్యలు చేపట్టారు. ఈ సహాయ చర్యల కోసం సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మందమర్రి ఏరియా కు చెందిన సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు.