బాసర ఘటనపై మంత్రి సీరియస్
బాసరలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన సైతం నిర్వహించారు. ఏకంగా విద్యా శాఖ మంత్రి దిగిరావాల్సి వచ్చింది. నెలరోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడే మళ్లీ ఇది జరగడంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులను వదిలిపెట్టవద్దని హెచ్చరించారు.