నాన్న.. ఇక రావా..
నాన్న ఉన్నాడని..వస్తాడని తనను ఆడిస్తాడని..తనతో ఆడుకుంటాడని ఆ చిన్నారి అశ..కానీ ఆ చిన్నారికేం తెలుసు..నాన్న రాడని.. రాలేడని…
ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో వరదల్లో ఉన్న గ్రామస్థులను కాపాడే ప్రయత్నంలో సింగరేణి రెస్క్యూ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో మరణించిన అంబాల రాము అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం జమ్మికుంట మండలం మడిపల్లిలో నిర్వహించారు.
ఆయన అంతిమయాత్ర సందర్భంగా మృతదేహాన్ని తీసుకువెళ్తున్న వాహనికి రాము ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. ఏడాది వయసున్న రాము కొడుకు ఆ ఫోటో చూసి నాన్నను రమ్మంటూ పిలవడం కంట తడిపెట్టించింది. పాపం ఆ చిన్నారికి నిజంగానే తెలియదు కదా.. నాన్న లేడని ఇక రాడని..