బాసర త్రిపుల్ ఐటీ వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణ
ఎట్టకేలకు ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ కి వీసీని నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ గా ఫ్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ కూడా కొనసాగుతారు. కొద్ది సేపటి క్రితం ఆయన బాధ్యతలు సైతం స్వీకరించారు. తమకు రెగులర్ వీసీ కావాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం
దిగి వచ్చింది. ఇప్పటికకైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.