బ్రేకింగ్.. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా క్యాంపస్ ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థులతో చర్చించే ప్రయత్నం చేశారు. రెండవ గేటు నుండి యూనివర్సిటీ ఆసుపత్రి కి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు శివసేన రెడ్డి, బృందం చేరుకుంది. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని తరలించే క్రమంలో సైతం వారితో యువజన విభాగం కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు.