పారిశుధ్య కార్మికురాలికి పాముకాటు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి వరదలో మునిగిన మాతాశిశు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బురదమయం అయిన ఆసుపత్రిని శుభ్ర పరుస్తున్న పారిశుధ్య కార్మికురాలిని పాముకాటు వేసింది. బాధితురాలు సునీత పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఇటీవలి వరదలకు గోదావరి ఒడ్డునే ఉన్న ఆసుపత్రి నీట మునిగింది. ఈ క్రమంలో ఆసుపత్రి మొత్తం దెబ్బతింది. బయట నుంచి పెద్ద సంఖ్యలో పాములు ఆసుపత్రిలోకి వచ్చాయి. ఆసుపత్రిలో ఇంకా పాములు ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు.వరదల వల్ల మాత శిశు ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్త,పాము కాటుకు గురైన కాంట్రాక్టు ఉద్యోగిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పూదరి తిరుపతి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజిద్, నాయకులు నాయకిని సురేందర్, అభి పాల్గొన్నారు.