ఆసుపత్రి సమస్యలు పరిష్కరించండి
బెల్లంపల్లిలోని ఏరియా ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఏరియా హాస్పిటల్ డివైసిఎంఓ శౌరీకి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషలిస్ట్ డాక్టర్లను వారానికి ఒకసారి రప్పించాలన్నారు. గైనకాలజిస్ట్ ను గతంలో మాదిరిగా పర్మనెంట్గా పోస్టింగ్ చేయాలని కోరారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులను రిఫరల్ రామకృష్ణాపూర్, గోదావరిఖని పంపించకుండా డైరెక్ట్ గా కరీంనగర్, హైదరాబాద్ పంపించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస రావు,ఏరియా హాస్పిటల్ ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, నాయకులు సిరిశెట్టి సత్యనారాయణ,స్వరూప, సోకాల శ్రీనివాస్ మానస, సురేష్, పాల్ బద్రి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.