బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి కోరారు. చంద్రవెల్లి అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై బెల్లంపల్లిలో ఐసీడీఎస్ సీడీపీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాగ్యలక్ష్మి పై వేధింపులతోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలో అంగన్వాడి కేంద్రం నడపవద్దనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అక్కడకు వచ్చిన అంగన్వాడీ అధికారులు అంగన్వాడీ టీచర్‌కు మద్దతు ఇవ్వాల్సి పోయి, ప్రభుత్వ ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆందోళనలో బెల్లంపల్లి ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.