బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుద్దామని వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి ని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో వారిని అరెస్టు చేశారు.