తల్లిపాలతో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని దీంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ మమత అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డకు ఆరు నెలలు నిండే వరకూ తల్లిపాలు పట్టించాలని, తదంనంతరం తల్లిపాలతో పాటు అనుబంధక పోషకాహారాన్ని అందించాలన్నారు. ప్రతి నెలా బిడ్డ బరువు తెలుసుకుంటూ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను తప్పక వేయించాలని మమత కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సార్ల పద్మ, అంగన్వాడీ టీచర్లు M.విజయలక్ష్మీ, రాజేశ్వరి, లీల, B.విజయలక్ష్మీ పాల్గొన్నారు.