బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డైరెక్టర్
బాసర ట్రిపుల్ ఐటీలో బాసర విద్యావ్యవస్థ పై రకరకాల అపోహలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆర్జీయూకేటి డైరెక్టర్ ప్రొ. సతీష్ కుమార్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన ఆధ్వర్యంలో స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ బృందం, అధ్యాపకులు మెస్ లను సందర్శించి స్టోర్ లలో వాడుతున్న వంటసామగ్రి పరిశీలించారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులతో ముచ్చటించి వారితో భోజనం చేశారు. డైరెక్టర్ ప్రొ.సతీష్ కుమార్ వెంట అసోసియేట్ డీన్ స్టూడెంట్స్ వేల్ఫర్ ఆఫిసర్ డా.దత్తు, వార్డెన్లు, అధ్యాపకులు ఉన్నారు.
నైట్ స్టడీ అవర్స్ పర్యవేక్షిస్తున్న డైరెక్టర్
అకాడమిక్ అవర్స్ పూర్తి కాగానే రాత్రి 8 గం.నుండి 10 గం.వరకు విద్యార్థులకు నిర్వహించే నైట్ స్టడీ అవర్స్ నిర్వహణ స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు. పరిక్షలు సన్నద్ధమౌతున్న విద్యార్థులతో సబ్జెక్ట్ వారీగా సందేహాలను నివృత్తి చేసుకునే వీలుందని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే తన వద్దకు తీసుకోరావాలని చెప్పారు.
మరోవైపు బాసరలో గురువారం కూడా ఫుడ్ పాయిజన్ అయ్యిందని, దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత కొట్టిపారేశారు. అస్వస్థతతో ఆరుగురే ఆసుపత్రిలో చేరారని ఆమె తెలిపారు. వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ (food poisoning) కాలేదని సుస్మిత అన్నారు. ఆ ఆరుగురికి కూడా వివిధ కారణాలు, సీజనల్ వ్యాధులే తప్ప వేరే కాదని వెల్లడించారు.