తెలంగాణ ప్రజల చిరస్మరణీయుడు జయశంకర్ సార్..
-ఆయన కన్న కలలు నిజం చేస్తున్న ముఖ్యమంత్రి
-నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజలకు నిత్యం చిరస్మరణీయుడని నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ అన్నారు. నస్పూరు మున్సిపాలిటీలో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ మాట్లాడుతూ సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్షించిన మహోన్నతుడు ఆయన అని కొనియాడారు. జయశంకర్ సార్ కన్న కలలను ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన అనతికాలంలోనే సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో పురోగతి సాధించిందని గుర్తు చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ చైర్మెన్ ఈసంపల్లి ప్రభాకర్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.