కేంద్రం బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి
మంచిర్యాలలో ట్రాన్స్కో ఉద్యోగుల ఆందోళన

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం మంచిర్యాలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులు పాత మంచిర్యాలలోని SE కార్యాలయం ముందు ధర్నా చేశారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలపై కేంద్రం కక్షగట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో డీఈలు రాజనర్సు, రాంటెంకి, ఏడీఈలు P.లక్ష్మణ్, రాజేష్, రాజకుమార్, ఖైసర్, రాజేంద్రప్రసాద్, మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు.