నేను క్రిస్టియన్.. జెండా ఎగరేయను..

నేను క్రిస్టియన్‌.. జెండాకు వంద‌నం చేయ‌ను… మా మత విశ్వాసాలు అందుకు ఒప్పుకోవు… ఇది ఒక ప్ర‌ధానోపాధ్యాయురాలు చెప్పిన మాట‌లు ఇవి…. తాను జెండాకు వందనం చేయడం కుదరదని ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌ త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ విషయం మీద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళ‌నాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందనం చేసేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తమిళసెల్వి తాను క్రిస్టియన్ నని, తమ మత విశ్వాసం ప్రకారం, జెండా వందనం చేయ‌మ‌ని ఖ‌రాఖండిగా చెప్పారు. త‌మిళ‌సెల్వి ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను సన్మానించడానికి స్టాఫ్ అంతా కలిసి ఆగస్టు 15 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రధానోపాధ్యాయురాలు నిరాకరించింది. దీంతో అసిస్టెంట్ హెడ్మాస్టర్ జెండాను ఎగురవేసింది. గతంలో కూడా తమిళ్‌సెల్వి జాతీయ జెండాను ఎగురవేసేందుకు, త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించినట్లు ఆమె స‌హ‌చ‌రులు చెప్పారు.

పైగా తమిళసెల్వి ఒక రికార్డు చేసిన వీడియో విడుద‌ల చేసింది. తాను క్రిస్టియన్ మతానికి చెందిన దానినని, జాతీయ జెండాను ఎగురవేయకపోయినా, వందనం చేయకపోయినా అగౌరవ పరిచినట్టు కాదని వాదించింది. “మేము దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం, మరెవరికీ కాదష‌ని అందులో వెల్ల‌డించింది. విషయం ధర్మపురి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో)కి ఫిర్యాదు చేశారు. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సెలవు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా, ఆమె అనారోగ్యం సాకుతో ఇలాంటి కార్యక్రమాల సమయంలో పాఠశాలకు రాలేదని చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like