సింగ‌రేణి సెక్యూరిటీ అధికారిపై దాడి

-జేకే ఓపెన్‌కాస్టు గనిలో ఘట‌న
-ఇల్లందులో దొంగల బీభత్సం

Singareni security officer attacked by robbers: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఓ ఓపెన్‌కాస్టులో సెక్యూరిటీ అధికారిపై దొంగ‌లు రాళ్ల దాడి చేశారు. ఆ గ‌నిలో దొంగ‌లు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి బేస్ క్యాంపు ద‌గ్గ‌రికి ఐదుగురు వ్య‌క్తులు దొంగతనానికి వచ్చారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని రమణారెడ్డి పట్టుకున్నారు. ఆ దుండగుడు ర‌మ‌ణారెడ్డి పై రాళ్లతో దాడిచేశాడు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. తోటిసిబ్బంది ఆయనను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రి హ‌స్తం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like