గని ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి
Singareni worker dies in mine accident: సింగరేణిలో జరిగిన గని ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. టబ్బులు మీద పడి కార్మికుడు మృత్యువాత పడ్డాడు. శ్రీరాంపూర్ కి చెందిన బండారి రాజలింగు (55) (ట్రామర్ మున్సి) గురువారం రెండవ షిప్ట్ విధులకు హాజరయ్యాడు. గనిలో3 సీమ్, 7 డీప్, 5 లెవల్ వద్ద పనిచేస్తుండగా రాత్రి 9 గంటలకు బొగ్గు లోడింగ్ టబ్బులు ఆయన మీద పడ్డాయి. దీంతో తోటి కార్మికులు అతడిని గుర్తించి రాత్రి 11 గంటలకు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే చనిపోయారని నిర్దారించారు, మృతుడు శ్రీరాంపూర్ నివాసి కాగా, బార్య ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు బలయ్యాడని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి సంతాపం
కార్మికుడి మృతి విషయం తెలియగానే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఏరియా హాస్పిటల్ కి వెళ్లి రాయలింగు మృత దేహాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు శ్రీరాంపూర్ ఏరియా చర్చల ప్రతి నిది పెట్టం లక్ష్మణ్ , ఏరియా నాయకులు పొగాకు రమేష్ , పిట్ సెక్రటరీ ఎంబడి తిరుపతి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.