రైతుల ఆదాయం పెంచేందుకు కృషి
-కోరమాండ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బారెడ్డి
-కోరమాండల్ ఆధ్వర్యంలో RO వాటర్ ప్లాంట్ ప్రారంభం
Efforts to increase farmers’ income: కోరమాండల్ రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోందని కోరమాండ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం జగిత్యాల జిల్లా పొలాస అగ్రికల్చర్ కళాశాలలో కోరమాండ్ బహూకరించిన 1000లీ కెపాసిటీ RO వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. కోరమాండల్ కంపెనీ వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పరిష్కారాలను అందిస్తోందని వెల్లడించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, KVK, అగ్రి రీసెర్చ్ స్టేషన్లు అగ్రికల్చర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కలిసి ఫీల్డ్ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ, డ్రోన్ అప్లికేషన్ ఉపయోగించి వ్యవసాయంలో సులభ పద్ధతులు కనుగొనాలని కోరారు. అంతేకాకుండా, వ్యవసాయ యాంత్రీకరణలో పరిష్కారాలను సూచించాలని విద్యార్థులకు తెలిపారు. కోరమాండల్ కి చెందిన 10 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలను డ్రోన్ అప్లికేషన్లో శిక్షణ కోసం పంపించామని, వారు సర్టిఫికెట్ సైతం పొందారని తెలిపారు. కోరమాండల్ ద్రవ ఎరువులైన అక్యుమిస్ట్ జింక్ , అక్యుమిస్ట్ కాల్షియంతో సహా అనేక ప్రభావవంతమైన ఎరువులను విడుదల చేసిందని వెల్లడించారు. కోరమాండల్ నానో డిఎపితో ఫీల్డ్ ట్రయల్స్‌ను కూడా నిర్వహిస్తోందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్, అగ్రికల్చర్ కళాశాల అసోసియేట్ డీన్ డా.నరేందర్ రెడ్డి, డా. సుధాకరెడ్డి , రాజేష్, సురేష్,రాహుల్ పాల్గొన్నారు