సఫాయి కార్మికుల కాళ్ళు కడిగిన ఎంపీ సోయం
-సఫాయి సిపాయిలు సమాజానికి ఆయుపట్టు
-కేసీఆర్ పాలనలో మున్సిపల్ కార్మికులకు అన్యాయం
-ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బాపురావు

MP Soyam Bapurao washed the feet of the cleaning workers: కేసీఆర్ పాలనలో మున్సిపల్ కార్మికులకు అన్యాయం జరిగిందని ఆదిలాబాద్ ఎంపీ సాయం బాపూరావు దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సఫాయి కార్మికుల కాళ్ళు కడిగి బట్టలు పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛంగా, కాలుష్యరహిత వాతావరణంలో ఉన్నారంటే దానికి కారణం మన సఫాయి కార్మికులే లేకుంటే అన్నారు. వాల్లే లేకపోతే మనం కరోనాను జయించే వాళ్ళం కాదన్నారు. ప్రతి రోజు మనకు సేవ చేసే వారికి సమోన్నత గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ సఫాయి కర్మచారి వాళ్ళ కాళ్ళు కడిగి సన్మానం చేసారని, అది అందరిలో స్ఫూర్తి నింపిందని స్పష్టం చేశారు. అదే స్పూర్తితో నరేంద్రమోడీ జన్మదినాన సఫాయి కార్మికులకు సన్మానం చేసినట్లు తెలిపారు. గిరిజన బంధు గురించి ఎనిమిదేళ్లుగా కెసిఆర్ మోసపూరిత వాగ్దానాలు ఇస్తూ ఎలా పబ్బం గడుపుతున్నాడో ఇది అలాంటిదే అన్నారు. సమస్యల పై నుండి ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ చేస్తున్న కొత్త డ్రామా అని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ కార్మికులకు అన్యాయం
కేసీఆర్ పాలనలో మున్సిపల్ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారన్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ దుయ్యబట్టారు. వారికి సరైన సమయానికి జీతాలు ఇవ్వకుండా వారిని క్షోభకు గురిచేస్తున్నారన్నారు. సఫాయి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆరోగ్యబీమా ఇస్తున్నదన్న విషయం వారికి తెలీదన్నారు. రాష్ట్రప్రభుత్వం సంవత్సరానికి మెడికల్ అలవెన్సులుగా 25 వేలు ఇవ్వాలని, కానీ తమకు జీతాలు రావడమే భాగ్యం అనేలా కార్మికులకు దుస్థితి కల్పించారని అన్నారు.
అనంతరం బీజేపీ నేతలు మున్సిపల్ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆకుల ప్రవీణ్, జోగు రవి, సోమ రవి, విజయ్, లోకా ప్రవీణ్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, వేద వ్యాస్, మహేందర్, దినేష్ మటోలియ, కృష్ణ యాదవ్ రాందాస్, సతీష్, రామిరెడ్డి జ్యోతి ఆశమ్మ, దత్త శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.